Chandrababu: ఒకాయన బుల్లెట్ దిగిందా అంటుండేవాడు... రేపు ఆయనకు పల్నాడులో కరెక్టుగా దిగుతుంది బుల్లెట్: చంద్రబాబు

Chandrababu satires on YCP leaders in Nellore
  • నెల్లూరులో టీడీపీ సభ
  • హాజరైన చంద్రబాబు
  • టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉద్ధృతం అవుతుందన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరు సభలో మాట్లాడుతూ... ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు జగన్ తీరును భరించలేక టీడీపీలోకి వస్తున్నారని, ఇది ప్రారంభం మాత్రమేనని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉద్ధృతం అవుతుందని అన్నారు. వైసీపీ నాయకుడు అనే వాడు రోడ్డు మీద తిరగాలంటేనే భయపడే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. 

నాడు ఎగిరెగిరి పడ్డాడు!

ఇక్కడ నెల్లూరు నడి వీధిలో ఒక నాయకుడు మొన్నటి వరకు ఎగిరెగిరి పడ్డాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా నిలవలేదు... కన్నుమిన్ను కానలేదు... మన ఖర్మ కొద్దీ ఆయన కూడా మంత్రి అయ్యాడు. కానీ, మొన్న బదిలీల్లో ఒక్క తన్ను  తంతే... ఒక్క జిల్లా కాదు మూడు జిల్లాల అవతలికి పోయి పడ్డాడు. బుల్లెట్ దిగిందా, లేదా అని ఒకప్పుడు డైలాగులు కొడుతుండేవాడు. ఇప్పుడు బుల్లెట్ కరెక్టుగా దిగింది. రేపు పల్నాడులో కూడా కరెక్టుగా బుల్లెట్ దిగుతుంది. ఈసారి తిరుగుటపాలో చెన్నైకి పోతాడు. ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది... వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. 

విశాఖను దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు తీసుకువచ్చారు!

ఇవాళ ఒకటి గమనించాలి. ఇక్కడ మీటింగ్ ఉందంటే, దీన్ని కౌంటర్ చేయడానికి, విశాఖపట్నంను దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు. అక్కడ మొత్తం ఊడ్చేశాడు... ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు... నెల్లూరుకు వస్తే మిగిలేది ఏదీ ఉండదు. ఇలాంటి నాయకులను తిరుగుటపాలో  పంపించేస్తారు మీరు... నాకు తెలుసు వీళ్ల తాట తీస్తారు మీరు.
Chandrababu
TDP
Nellore
YSRCP
Andhra Pradesh

More Telugu News