Director Krish: డ్రగ్స్ వ్యాపారి రిమాండ్ రిపోర్టుతో సినీ ఇండస్ట్రీలో కలకలం

Director Krish Consumed Drugs With His Friends Says Drug Supplier
  • డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకునే వాడని సయ్యద్ అబ్బాస్ అలీ వెల్లడి
  • రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్
  • వివేక్, క్రిష్, నిర్భయ్ సింధీలు కలిసి డ్రగ్స్ తీసుకున్నారని వివరణ

రాడిసన్ హోటల్ లో బయటపడ్డ డ్రగ్స్ పార్టీకి సంబంధించి మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన వ్యాపారి సయ్యద్ అబ్బాస్ అలీని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ దందాపై అలీని విచారించగా.. పలు సంచలన విషయాలు బయటపడ్డట్లు పోలీసులు చెప్పారు. అలీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న వివరాలతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది. రాడిసన్ హోటల్ ఓనర్ కొడుకు వివేక్, డైరెక్టర్ క్రిష్ మంచి స్నేహితులు.. వాళ్లిద్దరితో పాటు నిర్భయ్ సింధీ కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారని, ముగ్గురూ డ్రగ్స్ తీసుకున్నారని అలీ చెప్పాడట.

ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 24న రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్ పార్టీలోనూ క్రిష్ పాల్గొన్నాడని, శ్వేత, లిషి, నీల్ కూడా ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని అలీ చెప్పాడట. ఈ పార్టీకి సప్లై చేసిన డ్రగ్స్ ను మీర్జా వహీద్ బేగ్ నుంచి కొనుగోలు చేశానని, వాటిని వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అందజేశానని వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో గజ్జల వివేకానంద డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ ను చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News