Tracheostomy: అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు వైద్యుల సాహసోపేత నిర్ణయం

Doctors Plane To Save Rape Survivor life Plan To Insert Breathing Pipe
  • రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో యువతిపై ముగ్గురు యువకుల లైంగికదాడి
  • ఆపై పదునైన ఆయుధంతో దాడిచేసి కాల్పులు
  • శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతుండడంతో ట్రాకియోస్టమీ చేయాలని నిర్ణయం
  • చీరుకుపోయిన పొట్టకు విజయవంతంగా ఆపరేషన్
అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రి వైద్యులు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. శ్వాస తీసుకునేందుకు ఆమె శ్వాసనాళాన్ని తెరిచి అందులో పైపు పెట్టాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను ట్రాకియోస్టమీ అంటారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాటైన మెడికల్ బోర్డు బాధితురాలి ప్రాణాలను కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆమె ఎస్ఎంఎస్ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంది.

జైపూర్ జిల్లాలో శనివారం కోట్‌పుత్లి-బెహ్రార్‌లో ఓ యువతిపై ముగ్గురు యువకులు దాడిచేశారు. ఆపై ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. వెళ్తూవెళ్తూ పదునైన ఆయుధంతో దాడిచేశారు. దీంతో ఆమె పొట్ట చీరుకుపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటించారు. కాగా, మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. నేడు మరోమారు ఆమెకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Tracheostomy
Rape Suvivor
Rajasthan
Jaipur
Trachea

More Telugu News