Gareth Wynn Owen: అన్నపూర్ణ స్టూడియోస్ లో టెక్నాలజీని పరిశీలించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

British Dy High Commissioner Gareth Wynn Owen visits Annapurna Studios in Hyderabad
  • తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గా గారెత్ విన్ ఓవెన్
  • తెలుగు రాష్ట్రాల ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నం
  • సినిమా రంగం విశేషాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్న ఓవెన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ హైదరాబాదులోని సుప్రసిద్ధ అన్నపూర్ణ స్టూడియోస్ ను సందర్శించారు. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగార్జున తనయుడు, యువ హీరో అక్కినేని నాగచైతన్య ఈ సందర్భంగా విశిష్ట అతిథి గారెత్ విన్ ఓవెన్ కు స్వాగతం పలికారు. స్టూడియో సంగతులను ఆయనకు వివరించారు. 

కాగా, ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ చిత్రాలు విజయవంతం అవుతున్న తీరు, ఆయా చిత్రాలను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన టెక్నాలజీ గురించి తెలుసుకునేందుకు ఓవెన్ ఆసక్తి ప్రదర్శించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సాంకేతిక నిపుణులతో మాట్లాడి, వారు అనుసరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీల గురించి అడిగి తెలుసుకున్నారు.
Gareth Wynn Owen
Annapurna Studios
Nagachaitanya
Hyderabad
Tollywood
Telangana
Andhra Pradesh

More Telugu News