రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

CM Jagan releases YSR Rythu Bharosa funds
  • 1,078 కోట్ల రైతు భరోసా నిధుల విడుదల
  • సున్నా వడ్డీ రాయితీ కింద రూ.215 కోట్ల విడుదల
  • క్యాంపు కార్యాలయంలో రెండు పథకాలకు బటన్ నొక్కిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. నేడు రైతు భరోసా నిధులు రూ.1,078 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్... రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని అన్నారు. 

గత 57 నెలల్లో రైతు భరోసా రూపంలో రూ.34,288 కోట్లు అందించామని వెల్లడించారు. ఈ పథకం కింద 53.58 లక్షల మంది లబ్ది పొందుతున్నారని సీఎం జగన్ వివరించారు. తమది రైతు ప్రభుత్వం అని స్పష్టం చేశారు.

ఏపీలో ఒక హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 70 శాతం మంది ఉన్నారని, అర హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారని... అలాంటి రైతులకు తాము అందించిన పెట్టుబడి సాయం ఎంతో ఉపకరించిందని తెలిపారు. 

ఇక, అర్హులైన రైతులకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా విడుదల చేసినట్టు సీఎం జగన్ వెల్లడించారు. 10.79 లక్షల రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద ఇవాళ రూ.215.98 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.
Go Back to Shorts
YSR Rythu Bharosa
Jagan
Funds
YSRCP
Andhra Pradesh

More Telugu News