Nagababu: నాగబాబు వ్యాఖ్యలు వివాదాస్పదం.. వరుణ్ తేజ్ వివరణ!

Varun Tej gives clarity on Nagababu controversial comments
  • 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగబాబు వ్యాఖ్యలు
  • 5.3 అడుగుల ఎత్తున్న వ్యక్తికి పోలీస్, ఆర్మీ పాత్రలు సరిపోవని వ్యాఖ్య
  • ఒక టాలీవుడ్ హీరో గురించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రం మార్చి 1న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ భామ మానుషీ చిల్లర్ నటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిరంజీవి, నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 

నాగబాబు మాట్లాడుతూ... ఇండియన్ ఆర్మీ గొప్పదనాన్ని వివరించారు. ఇదే సమయంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసే భర్తలను కోల్పోయిన భార్యలకు రూ. 6 లక్షల విరాళం కూడా ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ఒక మాట కాంట్రవర్సీకి దారి తీసింది. కెరీర్ బిగినింగ్ నుంచి వరుణ్ తేజ్ రిస్క్ తో కూడుకున్న పాత్రలు చేస్తున్నాడని చెప్పారు. ఇది తనకు ఎంతో గర్వాన్ని కలిగిస్తోందని అన్నారు. ముఖ్యంగా ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు వరుణ్ హైట్, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోతాయని చెప్పారు. 5.3 అడుగులు ఉండే వ్యక్తి ఇలాంటి పాత్రలు వేస్తే బాగుండదని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కావాలనే ఒక స్టార్ హీరో గురించి ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 

దీంతో రంగంలోకి దిగిన వరుణ్ తేజ్ వివరణ ఇచ్చాడు. ఆ కామెంట్స్ ను కావాలనే ఒక హీరోకు ఆపాదిస్తున్నారని... దీనివల్ల నెగెటివిటీ పెరిగే అవకాశం ఉందని చెప్పాడు. తాను 6.3 అడుగుల హైట్ ఉంటానని... కాబట్టి 5.3 అడుగుల ఎత్తు ఉండే వారు పోలీస్ పాత్రలకు సెట్ కారని ఫ్లోలో నాన్న అన్నారని తెలిపాడు. అయినా టాలీవుడ్ లో 5.3 అడుగుల ఎత్తున్న హీరో ఎవరున్నారని ప్రశ్నించాడు. నాన్న చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కాదని చెప్పాడు.
Nagababu
Varun Tej
Tollywood
Operation Valentine Movie

More Telugu News