భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కొనలేం బాబోయ్ అంటున్న సామాన్యులు!
- పెరుగుతున్న ఎండలు, మేడారం జాతర ఎఫెక్ట్
- సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలు
- హైదరాబాద్ లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 300
గత నాలుగు రోజులుగా సాధారణ అమ్మకాలతో పోలిస్తే చికెన్ అమ్మకాలు 40 శాతం పడిపోయాయి. హైదరాబాద్ లో సగటున ప్రతి రోజు 12 వేల టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. గత ఆదివారం హోల్ సేల్, రిటైల్ కలిపి కేవలం 6 వేల టన్నుల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఎండాకాలం ముగిసిన తర్వాతే చికెన్ ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు చెపుతున్నారు.