లోన్ యాప్ వేధింపులకు హైదరాబాద్ లో విద్యార్థి బలి
- ఏజెంట్ల బెదిరింపులతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
- దుండిగల్ ఏరోనాటిక్ కాలేజీలో బీటెక్ చదువుతున్న మనోజ్
- లోన్ యాప్ రుణానికి ఈఎంఐ చెల్లించలేకపోవడంతో వేధింపులు
దీంతో లోన్ యాప్ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేయడంతో మనోజ్ ఆవేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యులకు, బంధువులు, స్నేహితులకు లోన్ యాప్ ఏజెంట్లు ఫోన్ చేశారు. ఈ విషయం తెలియడంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన మనోజ్ సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. మనోజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మనోజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.