Kolusu Parthasarathy: నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

Kolusu Parthasarathy joins TDP
  • టీడీపీలోకి ఊపందుకున్న వలసలు
  • వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్న నేతలు
  • ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి టీడీపీలోకి సాదర ఆహ్వానం పలికిన లోకేశ్
  • టీడీపీలో చేరిన విజయవాడ వైసీపీ అధ్యక్షుడు భవకుమార్
  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్

ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నకొద్దీ వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు కూడా ఊపందుకుంటున్నాయి. ఇవాళ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్థసారథి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొలుసు పార్థసారథికి పసుపు కండువా కప్పిన లోకేశ్ ఆయనకు మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలికారు. పార్థసారథి వెంట టీడీపీ నేతలు కేశినేని చిన్ని, కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్ కూడా ఉన్నారు. 

ఇక, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భవకుమార్ నేడు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. భవకుమార్ కు పసుపు కండువా కప్పిన లోకేశ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. 

అంతేకాదు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ కూడా టీడీపీలో చేరారు. అనుచరులతో కలిసి టీడీపీలోకి వచ్చిన తుమ్మల చంద్రశేఖర్ కు లోకేశ్ సాదర స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News