Mohan Babu: నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్

Mohan Babu warns not to use his name for politics says Mohan Babu
  • తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు
  • స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన
  • ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
తన పేరును కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నట్టు ఈ మధ్య కాలంలో తన దృష్టికి వచ్చిందని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తెలిపారు. దయచేసి ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని కోరుతున్నానని చెప్పారు. మనం అనేక భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని.. ఎవరి అభిప్రాయాలు వారివని, అది వారి వ్యక్తిగతమని అన్నారు. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమని చెప్పారు. 

తనకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని... శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటున్నానని తెలిపారు. తన విన్నపాన్ని ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా లేఖను విడుదల చేశారు.
Mohan Babu
Tollywood
Politics

More Telugu News