తెలంగాణలో రేపటి నుంచే రూ.500 సిలిండర్.. అమలు ఇలా..!
- గ్యాస్ డెలివరీ సమయంలో మొత్తం ధర చెల్లించాల్సిందే
- కేంద్రం సబ్సిడీతో పాటు మిగతా మొత్తం బ్యాంకు ఖాతాలో జమ
- ఉజ్వల లబ్దిదారులకూ మహాలక్ష్మి పథకం అమలు
ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికీ ఇదే విధానంలో రీయింబర్స్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. వీరికి ప్రతీ సిలిండర్ పై కేంద్రం రూ.340 రాయితీ ఇస్తోంది. ఈ మొత్తంతో పాటు గ్యాస్ ధర రూ.500 ను మినహాయించి మిగతా సొమ్మును రాష్ట్రప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో వేయనుంది. ఉదాహరణకు హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ.970 ఉంటే.. అందులో ఉజ్వల పథకం సబ్సిడీ రూ.340, మహాలక్ష్మి స్కీమ్ ధర రూ.500 పోనూ మిగిలిన మొత్తం రూ.130 ను రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. కాగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లతో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మహాలక్ష్మి పథకం అమలుపై చర్చించారు. సోమవారం నాడు లబ్దిదారుల జాబితాను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.