Anant Ambani: ఫైవ్‌స్టార్ హోటళ్లు లేని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుక.. అతిథుల కోసం అల్ట్రా లగ్జరీ టెంట్‌లు

Ultra luxury Tents For Ananat Ambani and Radhika Merchant Pre Wedding Marriage Function

  • జులైలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం
  • మార్చి 1 నుంచి మూడు రోజులపాటు ముందస్తు పెళ్లి వేడుకలు
  • అతిథుల కోసం సకల సదుపాయాలతో అల్ట్రా-లగ్జరీ టెంట్‌ల ఏర్పాటు
  • అతిథుల్లో అన్ని రంగాల ప్రముఖులు

ముకేశ్ అంబానీ-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వేరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ దంపతుల చిన్న కుమార్తె రాధికా మర్చంట్ వివాహం జులైలో జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజులపాటు ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. జామ్‌నగర్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు లేకపోవడంతో వేడుకల కోసం అల్ట్రా-లగ్జరీ టెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో అతిథుల కోసం బాత్రూములు సహా సకల సదుపాయాలు ఉంటాయి.

ముందస్తు పెళ్లి వేడుకకు హాజరయ్యే అతిథులు వీరే
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ నటులు, క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, బిల్‌గేట్స్, సుందర్ పిచాయ్, శంతను నారాయణ్, వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, గౌతం అదానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, నందన్ నీలేకని, సంజీవ్ గోయెంకా, రిషద్ ప్రేమ్‌జీ, ఉదయ్ కోటక్ తదితరులు హాజరుకానున్నారు. వేడుకల్లో హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నాతోపాటు, దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకులు ప్రదర్శనలిస్తారు. అతిథుల కోసం ఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.

Anant Ambani
Radhika Merchant
Mukesh Ambani
Anant Ambani Marriage
Nita Ambani
Jamnagar
Ultra luxury Tents
  • Loading...

More Telugu News