Chiranjeevi: వరుణ్ తేజ్ పై నా కోపానికి కారణం ఇదే: చిరంజీవి

This is reason for my anger on Varuj Tej says Chiranjeevi
  • మార్చి 1న విడుదలవుతున్న వరుణ్ తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'
  • నిన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి
  • వరుణ్ ప్రేమపై చిరంజీవికి ఆసక్తికర ప్రశ్న వేసిన యాంకర్ సుమ
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ లో ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వరుణ్ తేజ్ తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' మార్చి 1న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ ప్రేమ విషయంపై చిరంజీవికి యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు సంధించారు. వరుణ్ తన ప్రేమ గురించి తమకు లీక్ ఇవ్వలేదని... మీకేమైనా తెలుసా? అని ప్రశ్నించారు. 

దీనికి సమాధానంగా... వరుణ్ తనతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటాడని... వాళ్ల నాన్నకు కూడా చెప్పనివి తనతో పంచుకుంటాడని చిరంజీవి చెప్పారు. తానే ఇన్ స్పిరేషన్ అంటుంటాడని... కానీ, ప్రేమ విషయాన్ని మాత్రం తనతో దాచాడని తెలిపారు. ఇదే తనకు కోపంగా ఉందని అన్నారు. దీనిపై వరుణ్ స్పందిస్తూ... పెదనాన్న అంటే తనకు భయంతో కూడిన గౌరవమని చెప్పాడు. తన ప్రేమ విషయాన్ని అందరి కంటే ముందు పెదనాన్నకే చెప్పానని తెలిపాడు. 

మరోవైపు.. 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఎయిర్ ఫోర్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో కనిపించాడు. మానుషీ చిల్లర్ హీరోయిన్ పాత్రను పోషించగా... కీలక పాత్రలో నవదీప్ నటించాడు.
Chiranjeevi
Varun Tej
Lavanya Tripati
Tollywood
Operation Valentine

More Telugu News