ఎన్నికలకు సమాయత్తం.. 175 నియోజకవర్గాల నేతలతో జగన్ కీలక సమావేశం
- మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో జగన్
- రేపు మంగళగిరిలో భారీ సమావేశం
- వైనాట్ 175 లక్ష్యంగా మార్గనిర్దేశం చేయనున్న జగన్
ఈ నెల 27న మంగళగిరిలోని సీకే కన్వెషన్ లో ఈ సమావేశం జరగనుంది. 175 అసెంబ్లీ స్థానాలకు చెందిన నేతలంతా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దాదాపు 2 వేల మంది నేతలు సమావేశంలో పాల్గొంటారు. వైనాట్ 175 లక్ష్యంగా ఈ సమావేశంలో నేతలకు జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు. ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలి, ప్రత్యర్థుల విమర్శలను ఎలా తిప్పి కొట్టాలి? అనే దానిపై నేతలకు వివరించనున్నారు. మరోవైపు ఈరోజు కుప్పంలో జగన్ సిద్ధం సభ జరగనుంది.