రాంచీ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లండ్ దే పైచేయి
- టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 353 ఆలౌట్
- రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 219-7
- రాణించిన ఇంగ్లండ్ స్పిన్నర్లు బషీర్, హార్ట్ లే
ఇంగ్లండ్ స్పిన్నర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని టీమిండియాను దెబ్బతీశారు. షోయబ్ బషీర్ 4, టామ్ హార్ట్ లే 2 వికెట్లు పడగొట్టారు. సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 1 వికెట్ తీశాడు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే అవుట్ కావడం టీమిండియా ఇన్నింగ్స్ పై ప్రభావం చూపింది.