Sathya krishnan: అలాంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు: నటి సత్యకృష్ణన్

Sathya krishnan Interview
  • తమ ఫ్యామిలీలో సినిమాల వైపు వచ్చింది తానేనన్న సత్యకృష్ణన్
  • వివాహమయ్యాక ఎవరూ అభ్యంతరం పెట్టలేదని వెల్లడి   
  • ఎవరి పరిధిలో వారు వుంటే సమస్యలు ఉండవని   వ్యాఖ్య  

తెలుగులో కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నవారి జాబితాలో సత్యకృష్ణన్ ఒకరుగా కనిపిస్తారు. తాజాగా 'ఐడ్రీమ్స్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " నా మొదటి సినిమా 'డాలర్ డ్రీమ్స్'. ఆ తరువాత చేసిన 'ఆనంద్' .. 'బొమ్మరిల్లు'తో నాకు మంచి గుర్తింపు వచ్చింది" అన్నారు.

మా ఫ్యామిలీలో అంతా జాబ్ చేసేవారే. సినిమా వైపుగా వచ్చింది నేను మాత్రమే. మా వారిది తమిళ ఫ్యామిలీ. వివాహమైన తరువాత సినిమాలు చేయడానికి ఎవరూ అభ్యంతర పెట్టలేదు. కెరియర్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి .. అయినా వాటిని తట్టుకుని నిలబడ్డాను. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతున్నాను" అని చెప్పారు. 

"సినిమా ఇండస్ట్రీలో లేడీస్ ఫేస్ చేసే సమస్యలు ఎక్కువనే టాక్ ఉంది. అవి అన్ని చోట్లా ఉండేవే.  కాకపోతే సినిమా అనేసరికి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అందువలన ఇక్కడి విషయాలు హైలైట్ అవుతూ ఉంటాయి. ఎవరి పరిధిలో వారు ఉంటే ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉండవు. నేను అలాగే ఉంటాను. అందువలన ఇక్కడ నాకు ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు" అని అన్నారు.

  • Loading...

More Telugu News