గుడివాడ అమర్ నాథ్ స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించిన జగన్
- విశాఖకు వచ్చే ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యతల నుంచి అమర్ నాథ్ ను తప్పించిన జగన్
- బూడి ముత్యాలనాయుడుకు బాధ్యతల అప్పగింత
- ఇప్పటికే గుడివాడకు టికెట్ నిరాకరించిన జగన్
ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ ఈరోజు విశాఖకు వస్తున్నారు. అమర్ నాథ్ మంత్రి అయిన తర్వాత విశాఖకు ప్రముఖులు వచ్చే సమయంలో వారికి స్వాగతం పలికే బాధ్యతను ఆయనకు జగన్ అప్పగించేవారు. అయితే ఈసారి ఆ బాధ్యతను మంత్రి బూడి ముత్యాలనాయుడుకు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యతల నుంచి కూడా అమర్ నాథ్ ను తప్పించడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.