Nikhil: తండ్రి అయిన టాలీవుడ్ హీరో నిఖిల్

Hero Nikhil  and his wife Pallavi are now blessed with a BABY BOY
  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నిఖిల్ భార్య పల్లవి
  • 2020లో పల్లవిని ప్రేమ వివాహం చేసుకున్న నిఖిల్
  • ప్రస్తుతం 'స్వయంభూ' షూటింగ్ లో బిజీగా ఉన్న నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య పల్లవి ఈ ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ పల్లవిని 2020లో నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 'కార్తికేయ2'తో జాతీయ స్థాయిలో నిఖిల్ గుర్తింపు పొందాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ 'స్వయంభూ' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన వారియర్ పాత్రను పోషిస్తున్నాడు. 

Nikhil
Tollywood
Baby Boy

More Telugu News