Narendra Modi: మేడారం జాతరపై ప్రధాని మోదీ ట్వీట్

PM Modi tweet on Medaram Jatara
  • ఈరోజు ప్రారంభమైన మేడారం జాతర
  • వనదేవతల దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు
  • సమ్మక్క - సారలమ్మలకు ప్రణమిల్లుదామన్న మోదీ

దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర ఈరోజు ప్రారంభమయింది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది. ఆదివాసీల ఆరాధ్యదైవాలైన వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు పోటెత్తుతుండటంతో మేడారం భక్తజన సముద్రంగా మారింది. 

మేడారం జాతర సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క - సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అని అన్నారు. సమ్మక్క - సారలమ్మలకు ప్రణమిల్లుదామని... వారు వ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని చెప్పారు.

  • Loading...

More Telugu News