Phone Pe: ఫోన్ పే చేస్తే ధన్యవాదాలు చెప్పనున్న మహేశ్ బాబు

Phone Pe transactions with Mahesh Babu Voice in Smart speakers
  • స్మార్ట్ స్పీకర్లలో ఇకపై మహేశ్ గొంతు వినిపిస్తుందన్న కంపెనీ
  • కొత్త యాడ్ ను విడుదల చేసిన ఫోన్ పే
  • ఇప్పటికే కస్టమర్లకు అమితాబ్ వాయిస్ వినిపిస్తున్నట్లు వెల్లడి
షాపులో ఏదైనా కొని ఫోన్ పేతో డబ్బులు చెల్లిస్తున్నారా.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోకుండా మహేశ్ బాబు థ్యాంక్స్ చెప్పే వరకు ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ పే కంపెనీ హీరో మహేశ్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్ స్పీకర్లలో మహేశ్ బాబు గొంతును వినిపించేలా ఏర్పాట్లు చేసింది. ఫోన్ పేలో ప్రతీ ట్రాన్సాక్షన్ కూ మహేశ్ గొంతును వినొచ్చని చెప్పింది. దీనికోసం మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పిన వీడియోను ఫోన్ పే తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. 

ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లకు మహేశ్ బాబు తన గొంతుని అరువు ఇస్తున్నారు. ఇప్పటి వరకు వినిపిస్తున్న కంప్యూటర్ జెనరేటెడ్ వాయిస్ స్థానంలో ఇకపై మహేశ్ బాబు గొంతు వినిపిస్తుందని ఫోన్ పే కంపెనీ తెలిపింది. ఇందుకోసం మహేశ్ బాబు వాయిస్ శాంపిల్స్ తీసుకోని కృత్రిమ మేధతో వాయిస్ ను జెనెరేట్ చేశారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వాయిస్ తో కూడా ఫోన్‌పే లావాదేవీలు వినిపిస్తూ మార్కెట్ లోకి వచ్చింది. కాగా, ఇలా యాడ్స్ ద్వారా సంపాదించిన సొమ్మును హీరో మహేశ్ బాబు చిన్న పిల్లల చికిత్స కోసం ఉపయోగిస్తుంటారని ఆయన అభిమానులు చెబుతున్నారు.
Phone Pe
Mahesh Babu
Mahesh Babu Voice
Smart speakers

More Telugu News