Revanth Reddy: ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

CM Revanth Reddy met union minister Nitin Gadkari
  • ఢిల్లీలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణలో రహదారుల అభివృద్ధి పనులపై గడ్కరీతో చర్చ
  • రోడ్లకు సంబంధించి నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి
  • గడ్కరీతో భేటీలో పాల్గొన్న భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు గడ్కరీతో సమావేశమైన వారిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. 

తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణం, ప్రాంతీయ రింగ్ రోడ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధి, సిర్పూర్-కాగజ్ నగర్ నేషనల్ హైవే, భువనగిరి రహదారి, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. మొత్తమ్మీద 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారుల స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని కోరారు. 

అంతేకాదు, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్రం మంజూరు చేసిన కేబుల్ బ్రిడ్జిని మరో ప్రాంతానికి మార్చే అంశం కూడా నితిన్ గడ్కరీతో సమావేశంలో ప్రస్తావించారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు. 

ఇక, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్ మంజూరు చేయాలని, నల్గొండలో రవాణా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీని కోరినట్టు తెలిసింది.
Revanth Reddy
Nitin Gadkari
New Delhi
Telangana
Congress

More Telugu News