తెల్లారితే గ్లాస్ తోనే తేనేటి విందు: నాగబాబు
- సింక్ లో ఉన్నా సరే మరుసటి రోజుకు మళ్లీ వస్తుందని వ్యాఖ్య
- రెక్కలు విరిగిన ఫ్యాన్ తో ఏ ఊపయోగమూ ఉండదని ఎద్దేవా
- జగన్ కు నాగబాబు ఇచ్చిపడేశాడుగా.. అంటూ జనసైనికుల కామెంట్లు
‘గ్లాస్ సింక్ లో ఉన్నా కూడా తెల్లారితే మళ్లీ తేనేటి విందు ఇస్తుంది.. కానీ, ఫ్యాన్ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదు’ అంటూ జగన్ కు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. అయినా సారూ.. మీరు పబ్లిక్ మీటింగ్స్ లలో ప్రాసలు, పంచుల మీద పెట్టిన శ్రద్ధలో సగం ‘ప్రజాపరిపాలన’ మీద పెట్టుంటే బాగుండేదంటూ సీఎం జగన్ కు హితవు పలికారు. చివరగా అయామ్ టెల్లింగ్ దట్.. అంటూ కింగ్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ తో నాగబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ కు ఇచ్చిపడేశారంటూ జన సైనికులు కామెంట్లు పెడుతున్నారు.