మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరుతున్న రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ
- లోక్ సభ ఎన్నికలు, నామినేటెడ్ పదవులపై చర్చించనున్న రేవంత్
- మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించనున్న సీఎం
- విస్తరణలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం
కేబినెట్ విస్తరణపై కూడా హైకమాండ్ తో రేవంత్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్ లో చోటు దక్కలేదు. దీంతో, మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ రేసులో ఉండగా... నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు.