Instagram Reels: ఇన్‌స్టా రీల్స్‌కు బానిసగా మారిన భార్య.. భర్త ఫోన్ లాక్కోవడంతో ఆత్మహత్య

woman addicted to insta reels committed suicide after husband snatched her phone
  • చత్తీస్‌గఢ్‌లోని భిలాయిలో ఘటన
  • రీల్స్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న భార్య
  • భార్యతో గొడవ పడి ఫోన్ లాక్కోవడంతో మనస్తాపం
ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ మోజులో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న భార్య నుంచి భర్త ఫోన్ లాక్కున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. చత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలోని భిలాయిలో జరిగిందీ ఘటన. రీల్స్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న భార్యను భర్త పలుమార్లు హెచ్చరించాడు. తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో శుక్రవారం ఇద్దరికీ మరోమారు గొడవ జరిగింది. ఈ సందర్భంగా ఆమె నుంచి అతడు ఫోన్ లాక్కుని వెళ్లిపోయాడు.

దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య.. భర్త బయటకు వెళ్లిన కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ ఫోన్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
Instagram Reels
Social Media
Chhattisgarh
Bhilai

More Telugu News