ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన కేజ్రీవాల్
- ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు సమన్లు
- కేజ్రీవాల్ అంశం కోర్టు పరిధిలో ఉందన్న ఆప్
- పదేపదే సమన్లు పంపవద్దని విన్నపం
ఈనెల 17న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ హాజరయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా... మార్చి 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.