Chandrababu: నా రాజకీయాల ముందు నువ్వొక బచ్చా!: చంద్రబాబు

Chandrababu fires on CM YS Jagan
  • ఇంకొల్లులో రా కదలిరా సభ
  • ఆవేశపూరితంగా ప్రసంగించిన చంద్రబాబు
  • నీ పులివెందుల కూడా మేం గెలవబోతున్నాం అంటూ వ్యాఖ్యలు
  • ఈ మీటింగ్ చూసి జగన్ ప్యాంట్ తడిసిపోయిందన్న చంద్రబాబు

పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో జరిగిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రాజకీయాల ముందు నువ్వొక బచ్చా అంటూ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ పులివెందుల కూడా మేం గెలవబోతున్నాం... కాస్కో జగన్ మోహన్ రెడ్డీ అంటూ సవాల్ విసిరారు. 

"మేం మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డీ! ఈ మీటింగ్ చూసి జగన్ మోహన్ రెడ్డి ప్యాంట్ తడిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి సునామీ సృష్టించడం ఖాయం. గెలుపు మనదే... ఎవరికైనా అనుమానం ఉందా? అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతామే తప్ప నిలిచేదే లేదు. మీరు జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధం... వైసీపీని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధం!" అంటూ చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగించారు.

  • Loading...

More Telugu News