Nara Brahmani: ఆటోనగర్ లో వీవర్ శాల ప్రారంభోత్సవానికి హాజరైన నారా బ్రాహ్మణి

Nara Brahmani attends Weavershala inauguration in Autonagar
  • మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో బ్రాహ్మణి పర్యటన
  • చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించిన లోకేశ్ అర్ధాంగి
  • తమ సమస్యలు విన్నవించుకున్న చేనేత కార్మికులు
  • మంగళగిరి చేనేత రంగానికి టాటా గ్రూప్ మద్దతు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పర్యటించారు. ఆత్మకూరులో ఉన్న చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించారు. అక్కడి చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 

తన పర్యటన సందర్భంగా నారా బ్రాహ్మణి ఆటో నగర్ లో వీవర్ శాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణితో పాటు టాటా గ్రూప్ కు చెందిన తనేరా సంస్థ సీఈవో అంబుజ నారాయణ కూడా పాల్గొన్నారు. మంగళగిరి చేనేత రంగానికి టాటా గ్రూప్ మద్దతు ఇస్తుందని అంబుజ నారాయణ తెలిపారు.

  • Loading...

More Telugu News