Goods Rail: విజయవాడ - ఖమ్మం మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Goods rail derailed between Vijayawada and Khammam
  • చింతకాని మండలం పాతర్లపాడు వద్ద ప్రమాదం
  • ట్రాక్ పక్కకు జరిగిన రెండు బోగీలు
  • కాజీపేట నుంచి విజయవాడ వెళ్లే రైళ్ల నిలిపివేత
విజయవాడ - ఖమ్మం మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం ఈ ఉదయం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు 113వ గేటు సమీపంలోకి వచ్చిన వెంటనే భారీ శబ్దాలు వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలట్ గూడ్స్ రైలును ఆపేశారు. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. ప్రమాదం కారణంగా కాజీపేట నుంచి విజయవాడకు వెళ్లే పలు రైళ్లను ఆపేశారు. ప్రమాదం జరిగిన చోట తాత్కాలిక మరమ్మతులను చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
Goods Rail
Vijayawada
Khammam
Derail

More Telugu News