Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

Chandrababu and Bhuvaneswari participates in Rajashyamala Yagam
  • ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నేడు ప్రారంభమైన యాగం
  • తొలిరోజున సతీసమేతంగా పూజల్లో పాల్గొన్న చంద్రబాబు
  • వేదమంత్రాలతో చంద్రబాబు నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం 
టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తమ నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఇవాళ తొలిరోజున చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు పూజా కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. రాజశ్యామల యాగం మూడ్రోజుల పాటు జరగనుంది. ఆదివారం నాడు పూర్ణాహుతితో ముగియనుంది. ఆ క్రతువుకు పలువురు టీడీపీ నేతలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. వేదమంత్రాలతో చంద్రబాబు నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Chandrababu
Nara Bhuvaneswari
Rajashyamala Yagam
TDP
Undavalli

More Telugu News