Palnadu District: నరసరావుపేటలో దారుణం.. బాలికలకు మద్యం తాగించి రాత్రంతా నిర్బంధించి అఘాయిత్యం

Two minor girls sexually assaulted by two youth in Narasaraopet
  • బాలికలను గదికి రప్పించి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించిన నిందితులు
  • మత్తులోకి చేరుకోగానే లైంగికదాడి
  • రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో బాలికల కుటుంబ సభ్యులు ఆందోళన
  • పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి
  • అమ్మాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
  • కేసు పెట్టేందుకు బాధిత కుటుంబ సభ్యుల నిరాకరణ
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలను మభ్యపెట్టి మద్యం తాగించి ఆపై రాత్రంతా నిర్బంధించిన ఓ బాలుడు, యువకుడు లైంగికదాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలో 8వ తరగతి చదువుతున్న బాలికతో కోటప్పకొండ రోడ్డుకు చెందిన 17 ఏళ్ల బాలుడికి లైంగిక సంబంధం ఉంది. ఓ డ్యాన్స్‌పార్టీ ట్రూప్‌లో పనిచేస్తున్న బాలుడు తన చెడువ్యసనాలను బాలికకు కూడా అంటించాడు. గోనెసంచిల దుకాణంలో పనిచేస్తున్న అతడి స్నేహితుడు (21) తన శారీరక వాంఛలు తీర్చుకునేందుకు ఆరో తరగతి చదువుకుంటున్న బాలిక స్నేహితురాలికి వలవేశాడు. బుధవారం రాత్రి స్నేహితులిద్దరూ కలిసి బాలికలను కోటప్పకొండ రోడ్డులోని తమ గదికి పిలిపించుకున్నారు.

అక్కడ వారికి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి వారితో తాగించారు. వారు మత్తులోకి చేరుకోగానే వారిపై ఇద్దరూ లైంగికదాడికి పాల్పడ్డారు. ఆడుకునేందుకు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలికలు రాత్రి పొద్దుపోయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో దారుణం వెలుగుచూసింది. అతడిచ్చిన సమాచారంతో గదిలో నిర్బంధించిన బాలికలను గుర్తించి రక్షించారు. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికలను తమతో స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఈ ఘటనపై బాధిత బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనకాడినట్టు తెలుస్తోంది.
Palnadu District
Narasaraopet
Crime News
Latest News

More Telugu News