Vijay Devarakonda: నిన్ను చూసి గర్వపడుతున్నా.. రష్మిక మందన్నకు విజయ్‌ దేవరకొండ అభినందనలు

So Proud Says Rumoured Boyfriend Vijay Deverakonda on Rashmika making it to forbes list
  • ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’ జాబితాలో రష్మిక మందన్న
  • సోషల్ మీడియా వేదికగా రష్మికకు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు 
  • మరింతగా ఎదగాలంటూ పోస్ట్
  • రష్మికపై అభిమానుల ప్రశంసల వెల్లువ

ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు సినీ నటుడు విజయ్‌ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించాడు. ‘‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఫ్యాన్స్‌ కూడా రష్మికపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన 30 ఏళ్లలోపు యువతీయువకులతో ఫోర్బ్స్ పత్రిక.. ‘30 అండర్ 30’ జాబితాను రూపొందిస్తుంది. ఈ ఏడాది రష్మికతో పాటు మరో ముగ్గురు నటీమణులకు ఈ లిస్టులో చోటుదక్కింది. తనకు దక్కిన ఈ గుర్తింపుపై రష్మిక తొలిసారి సోషల్  మీడియా వేదికగా స్పందించింది. మ్యాగజైన్ కవర్ ఫొటోను షేర్ చేసిన రష్మిక తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్టును విజయ్ దేవరకొండ కూడా షేర్ చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపాడు. 

కాగా, రష్మిక, విజయ్‌ దేవరకొండ లవ్‌లో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వారికి ఎంగేజ్‌మెంట్ కానున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఇటీవలే క్లారిటీ ఇచ్చిన రష్మిక.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ప్రతి రెండేళ్లకు ఓసారి మీడియాలో తన పెళ్లి వార్తలు వస్తుంటాయని వ్యాఖ్యానించింది. అలాగే.. ఏడాదికోసారి తన నిశ్చితార్థం వార్తలు వస్తాయని చమత్కరించింది.

  • Loading...

More Telugu News