LB Nagar: ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళుతున్న సీఐ దుర్మరణం

Exicse CI dead SI injured in road accident in LB nagar hyderabad
  • హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఘటన
  • యూటర్న్ తీసుకుని రాంగ్‌రూట్‌లో వెళుతున్న కారు బైక్‌ను ఢీకొట్టిన వైనం
  • బైక్ పై ప్రయాణిస్తున్న ఎక్సైజ్ పోలీసు స్టేషన్ సీఐ సాధిక్ అలీ దుర్మరణం
  • ఘటనలో నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్సై కాజా వలీకి గాయాలు
హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మరణించగా ఎస్సై గాయాలపాలయ్యారు. ఎల్బీనగర్‌లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సీఐ సాధిక్ అలీ మృతిచెందారు. ఎస్సై కాజా వలీ మోహీనుద్దీన్‌ గాయాలపాలయ్యారు. సాధిక్‌ అలీ చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తుండగా, కాజా వలీ నారాయణ గూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తున్నారు. మలక్‌పేట క్వార్టర్స్‌లో ఉండే వీరిద్దరూ మంగళవారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ప్రమాదానికి కారణమైన కారు వినుషా శెట్టి అనే పేరుపై రిజిస్ట్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు కూడా ఉండటం గమనార్హం. ప్రమాదం జరిగాక కారు ఆపకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
LB Nagar
Road Accident
Hyderabad
Telangana
Crime News

More Telugu News