KTR: రోడ్‌సైడ్ కేఫ్‌లో చాయ్ తాగి స్థానికులతో ముచ్చటించిన కేటీఆర్.. వీడియో ఇదిగో!

BRS working president KTR stops for tea at roadside hotel in Choutuppal
  • నల్గొండ సభ ముగించుకుని వస్తుండగా చౌటుప్పల్‌లో ఆగిన బీఆర్ఎస్ అగ్రనేత
  • కేఫ్‌లో కేటీఆర్‌ను చూసి ఆశ్చర్యపోయిన జనం
  • సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్న అభిమానులు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల తర్వాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. నిన్న నల్గొండలో నిర్వహించిన ‘చలో నల్లగొండ’సభలో అధికార కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. నీళ్ల కోసం మరోమారు ఉద్యమానికి సై అన్నారు. అశేషంగా తరలివచ్చిన జనాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు ఆనందంలో మునిగిపోయారు.

కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి సహా పలువురు అగ్రనేతలు హాజరయ్యారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మార్గమధ్యంలో చౌటుప్పల్ వద్ద రోడ్‌సైడ్ కేఫ్‌లో చాయ్ తాగేందుకు ఆగారు. లోపలికి వస్తున్న కేటీఆర్‌ను చూసిన జనం కాసేపు తమనుతాము నమ్మలేకపోయారు. కేఫ్‌లో టీ తాగిన కేటీఆర్ కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. కేటీఆర్ రాకతో హోటల్‌లో సందడి నెలకొంది. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు. కొందరు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
KTR
Viral Videos
BRS
Telangana
Chalo Nalgonda

More Telugu News