తాడేపల్లిలో సీఎం నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు... తీవ్ర ఉద్రిక్తత
- 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలంటూ ఏబీవీపీ డిమాండ్
- సీఎం నివాసం వద్దకు ఒక్కసారిగా దూసుకువచ్చిన విద్యార్థి నేతలు
- అడ్డుకున్న పోలీసులు
పలువురు విద్యార్థి నేతలు పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. దొరికిన వాళ్లను ఓ వాహనంలోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ముట్టడిలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థి నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థి నేతలకు గాయాలైనట్టు సమాచారం.