NTR: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి... కేంద్రానికి లేఖ రాసిన కనకమేడల

TDP MP Kanakamedala Ravindra Kumar wrote PM and Home minister seeking Bharataratna to NTR
  • ఇటీవల పలువురికి భారతరత్న ప్రకటించిన కేంద్రం
  • ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్లు
  • ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కనకమేడల లేఖలు
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల పలువురికి అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు కూడా భారతరత్న ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయి. ఈసారైనా కేంద్రం ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే బాగుండునని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కేంద్రానికి లేఖ రాశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథకాలను ప్రజలకు పరిచయం చేసింది ఎన్టీఆరేనని వివరించారు. అలాంటి మహనీయుడికి భారతరత్న ఇవ్వడం సముచితమని పేర్కొన్నారు. ఈ మేరకు కనకమేడల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు రాశారు.
NTR
Bharataratna
Kanakamedala Ravindra Kumar
TDP
Andhra Pradesh

More Telugu News