YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ

YS Sharmila meets telangana CM Revanth Reddy
  • హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ
  • ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కలిసిన షర్మిల
  • గతంలో తన కొడుకు పెళ్లి కోసం ఆహ్వాన పత్రిక అందించేందుకు కలిసిన షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం షర్మిల తొలిసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇరువురి మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించేందుకు షర్మిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
YS Sharmila
Revanth Reddy
Congress

More Telugu News