Janasena: రాష్ట్ర ప్రచార కమిటీని ప్రకటించిన జనసేన... చైర్మన్ గా నిర్మాత బన్నీ వాస్, వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్

Janasena announced state campaign committee chaired by Bunny Vas
  • ఇటీవలే జనసేనలో చేరిన బన్నీ వాస్, జానీ మాస్టర్
  • కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ప్రచార కమిటీ వైస్ చైర్మన్ పదవి
  • ఉమ్మడి జిల్లాలకు సమన్వయకర్తల ఎంపిక
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఎన్నికల నేపథ్యంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీని ప్రకటించింది. ఇటీవలే జనసేన పార్టీలో చేరిన టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ ను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు. 

అంతేకాదు, కొన్నిరోజుల కిందటే జనసేన తీర్థం పుచ్చుకున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఈ కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. మరో వైస్ చైర్మన్ గా యాతం నగేశ్ బాబు, కార్యదర్శిగా వబిలిశెట్టి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా పోగిరి సురేశ్ బాబు, బెల్లంకొండ అనిల్ కుమార్, బండి రమేశ్ కుమార్ నియమితులయ్యారు. 

అదే సమయంలో, ఉమ్మడి జిల్లా జనసేన సమన్వయకర్తలను కూడా ప్రకటించారు.
Janasena
Campaign Committee
Bunny Vas
Chairman
Andhra Pradesh
Tollywood

More Telugu News