Bangladesh Girl: డబ్బు కోసం ఏ పనైనా చేస్తానన్న బంగ్లాదేశ్ యువతి.. వ్యభిచారం చేయించిన హైదరాబాద్ దంపతులు

Bangladesh Girl and Hyderabadi couple arrested in prostitution case
  • ఓ యాప్ ద్వారా చాంద్రాయణగుట్టలోని దంపతులకు పరిచయమైన స్రిస్టీ అక్తర్
  • డబ్బు సంపాదనకు అక్రమంగా హైదరాబాద్‌కు
  • ఆమెతో వ్యభిచారం చేయిస్తున్న దంపతులు
  • వారి మధ్య గొడవతో విషయం వెలుగులోకి
డబ్బు సంపాదనకు ఏమార్గమైనా పర్వాలేదని భావించిన ఓ బంగ్లాదేశ్ యువతి అక్రమంగా హైదరాబాద్ చేరుకుంది. అపై తనకు పరిచయమైన వారి ఇంట్లో ఉంటూ వ్యభిచారం చేస్తోంది. తాజాగా వారి మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో విషయం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన షేక్ సోనియా (27), మహ్మద్ సల్మాన్ (24) దంపతులకు బంగ్లాదేశ్‌కు చెందిన స్రిస్టీ అక్తర్ (22)తో ఓ యాప్ ద్వారా పరిచయమైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పనేమైనా దొరుకుతుందా? అని సోనియా దంపతులను ఆరా తీసింది. ఇళ్లలో పనిచేస్తే నెలకు రూ. 10 వేలు వస్తాయని, అదే వ్యభిచారం చేస్తే రూ. 20 వేలకు సంపాదించుకోవచ్చని వారు ఆమెకు చెప్పారు.

డబ్బు కోసం ఏపనైనా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలా రావాలని అడగడంతో ఆ రిస్క్ నువ్వే తీసుకోవాలని చెప్పారు. దీంతో రెండు నెలల క్రితం అక్తర్ అక్రమ మార్గంలో కోల్‌కతా వచ్చి అక్కడి నుంచి రైలులో సికింద్రాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి సోనియా దంపతులకు ఫోన్ చేయడంతో వారొచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

అది మొదలు సోనియా దంపతులు ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు. సోనియా స్వయంగా అక్తర్‌ను తీసుకెళ్లి తీసుకొచ్చేది. ఈ క్రమంలో శుక్రవారం అక్తర్‌కు ఓ ఫోన్ రావడంతో ఆమె ఒంటరిగా అత్తాపూర్ వెళ్లింది. అనుమానించిన సోనియా దంపతులు ఆమెను వెంబడించి అత్తాపూర్‌లో ఆమెను పట్టుకున్నారు. తమకు చెప్పకుండా ఎందుకొచ్చావని అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. అది మరింత పెరగడంతో సోనియా నుంచి సెల్‌ఫోన్ లాక్కున్న అక్తర్ డయల్ 100కు ఫోన్ చేసింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అసలు విషయం తెలుసుకుని ముగ్గురినీ చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, స్రిస్టీ అక్తర్‌కు బంగ్లాదేశ్‌లో భర్త అసిఫ్‌ఖాన్, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. భర్త మేస్త్రీ పనిద్వారా సంపాదించే డబ్బు సరిపోకపోవడంతోనే అక్తర్ అక్రమమార్గంలో హైదరాబాద్ వచ్చి వ్యభిచారం వృత్తిలో చేరినట్టు పోలీసులు తెలిపారు.
Bangladesh Girl
Hyderabad
Prostitute
Crime News

More Telugu News