Ayodhya Ram Mandir: అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు.. 60 మంగళ సూత్రాల చోరీ

Theives steal 60 mangal sutras from women devotees in Ayodhya
  • అయోధ్యలో కరీంనగర్‌ మహిళ సొత్తు చోరీ, పోలీసులకు ఫిర్యాదు 
  • ఇప్పటివరకూ 60 మంది మహిళల మంగళ సూత్రాలు పోయినట్టు ఫిర్యాదులు
  • భద్రతా ఏర్పాట్లలో సడలింపులే దొంగలకు అవకాశంగా మారాయంటూ ప్రజల విమర్శలు
అయోధ్యలో పర్యాటకుల రద్దీని అవకాశంగా తీసుకుంటూ దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళుతున్నారు. 

కరీంనగర్‌కు చెందిన కొందరు భక్తులు ఇటీవల రామ్‌ లల్లాను దర్శించుకునేందుకు అయోధ్యకు వెళ్లగా వారిలోని ఓ మహిళ వద్ద బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. దీంతో, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ 60 మంది మహిళల మంగళ సూత్రాలు చోరీకి గురైనట్టు అక్కడి పోలీసులు చెబుతున్నారు.  

రామమందిర ప్రారంభోత్సవం తరువాత భద్రతా ఏర్పాట్లు కాస్తంత సడలించడంతో దొంగలు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడి పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా తొలగించడం దొంగలకు అవకాశంగా మారినట్టు తెలుస్తోంది.
Ayodhya Ram Mandir
Ayodhya

More Telugu News