Pawan Kalyan: ఢిల్లీకి వెళుతున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan going to Delhi
  • ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
  • టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొడుస్తున్న పొత్తు
  • బీజేపీ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి పవన్

రోజుల వ్యవధిలోనే ఏపీ రాజకీయాలు రసవత్తర మలుపు తీసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును కేంద్ర హోం మంత్రి అమిత్ పిలిపించుకుని మరీ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఏర్పడబోతోందనే వార్తలకు పూర్తి బలం చేకూరింది. మరోవైపు బీజేపీతో ముందు నుంచి కూడా జనసేన పొత్తులోనే ఉంది. జనసేనాని పవన్ కల్యాణ్ సోమవారం లేదా మంగళవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు, సీట్ల పంపకాల అంశంపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చించబోతున్నట్టు సమాచారం. దీంతోపాటు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా బీజేపీ హైకమాండ్ తో చర్చించనున్నారు. ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News