Sharwanand: చిరంజీవి గొప్ప లక్షణాలన్నీ రామ్ చరణ్‌లోనూ ఉన్నాయి: శర్వానంద్

Sharwanand Ram Charan possesses all the good qualities of Chiranjeevi Garu
  • మంచు మనోజ్ వ్యాఖ్యాతగా ఉస్తాద్ టాక్‌ షోలో పాల్గొన్న శర్వానంద్
  • షో సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిపై మనోజ్ ప్రశంసలు
  • చిరంజీవి లక్షణాలు ఆయన తనయుడు రామ్‌చరణ్‌లోనూ ఉన్నాయన్న శర్వానంద్
  • రామ్‌చరణ్ తనకు ఫ్రెండ్ అవటం గర్వకారణమని వ్యాఖ్య
సినీ హీరో మంచు మనోజ్ వ్యాఖ్యాతగా వస్తున్నా ‘ఉస్తాద్’ టాక్‌ షోలో ఇటీవల శర్వానంద్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా శర్వానంద్.. తన స్నేహితుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించాడు. చిరంజీవిలోని గొప్ప లక్షణాలన్నీ రామ్‌చరణ్‌లోనూ ఉన్నాయని చెప్పారు. 

తొలుత మంచు మనోజ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన తెస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ‘‘చిరంజీవి గారి గొప్పదనం గురించి ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచీ ఆయన తన వెంట ఉన్న వారికి, తనను నమ్ముకున్న వారికి అండగా ఉన్నారు. తన వారికి ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు. నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. చిరంజీవి గారి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు’’ అని మంచు మనోజ్ అన్నాడు. 

దీనికి శర్వానంద్ సమాధానమిస్తూ రామ్‌చరణ్‌లోనూ అవే లక్షణాలు ఉన్నాయన్నారు. ‘‘చిరంజీవి గారి లాగానే రామ్‌చరణ్ కూడా తన వాళ్లకు అండగా ఉంటాడు. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటాడు. అలాంటి వ్యక్తి నాకు స్నేహితుడు కావడం గర్వకారణం’’ అని అన్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శర్వానంద్, రామ్‌చరణ్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులన్న విషయం తెలిసిందే.

ఇక మనోజ్ ప్రస్తుతం ‘వాట్ ద ఫిష్’ మూవీలో నటిస్తూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ మూవీలో చేస్తున్నారు.
Sharwanand
Chiranjeevi
Ramcharan
Manchu Manoj

More Telugu News