YS Jagan: ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

AP CM Jagan met PM Modi in Delhi
  • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్
  • పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోదీతో భేటీ
  • దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం
  • అనంతరం నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం జగన్ 
ఢిల్లీ  పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఈ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంటులోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది. 

ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంటులోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు.
YS Jagan
Narendra Modi
New Delhi
YSRCP
BJP
Andhra Pradesh

More Telugu News