హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య!
- పేట్‌బషీరాబాద్ ప్రాంతంలో ఘటన
- మైసమ్మగూడలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి
- ఉద్యోగ ప్రయత్నాల్లో తరచూ విఫలమవుతూ చివరకు బలవన్మరణం
- మృతుడు వనపర్తి జిల్లా వాస్తవ్యుడని చెప్పిన పోలీసులు
బుధవారం కాలేజీలో జరిగిన క్యాంపస్ సెలక్షన్లలో మహ్మద్ ఎంపిక కాలేదు. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. స్నేహితులు గదిలో లేని సమయంలో ఉరేసుకున్నాడు. రాత్రి 11 గంటలకు తిరిగొచ్చిన స్నేహితులు..మహ్మద్ బలవన్మరణానికి పాల్పడ్డ విషయాన్ని గుర్తించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.