YS Sharmila: వైఎస్ షర్మిలకు భద్రత పెంపు

Security increased for YS Sharmila
  • తనకు భద్రత కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల
  • టూ ప్లస్ టూకి భద్రత పెంచిన పోలీసులు
  • డీజీపీ ఆదేశాల మేరకు భద్రతను పెంచామన్న ఎస్పీ

తనకు భద్రత కల్పించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డ సంగతి తెలిసిందే. తనకు చెడు చేయాలనే ఉద్దేశంతోనే భద్రతను కల్పించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షురాలినైన తాను రాష్ట్రమంతా పర్యటించాల్సి ఉంటుందని... భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. 

ఈ నేపథ్యంలో కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రతను పెంచారు. ఈ విషయాన్ని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ నుంచి టూ ప్లస్ టూకి పెంచామని చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకు భద్రతను పెంచామని తెలిపారు. ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇస్తే... వారికి గన్ మెన్లను కేటాయిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News