AP Election Survey: ఏపీలో టీడీపీ ఘన విజయం.. వైసీపీకి ఎదురుగాలి: ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే

TDP huge win in lok Sabha elections says India Today mood of the nation survey
  • టీడీపీకి 17 ఎంపీ సీట్లు వస్తాయన్న ఇండియా టుడే సర్వే
  • 8 స్థానాలకు పరిమితం కానున్న వైసీపీ
  • 45 శాతం ఓట్లను సాధించనున్న టీడీపీ
ప్రస్తుతం యావత్ దేశం దృష్టి లోక్ సభ ఎన్నికలపై ఉంది. కేంద్రంలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడతారా? లేదా.. విపక్షాల కూటమి బీజేపీ జోరుకు బ్రేక్ వేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు ఓటర్ల నాడి ఎలా ఉంది? అనే దానిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. 

ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఏపీలో టీడీపీ అఖండ విజయాన్ని సాధించబోతోందని తేలింది. ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను టీడీపీ ఏకంగా 17 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని సర్వే చెప్పింది. అధికార వైసీపీ కేవలం 8 స్థానాలకే పరిమితం కానుందని తెలిపింది. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. వైసీపీకి 41.1 శాతం, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ కు 2.7 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది.
AP Election Survey
India Today
Mood of the nation survey
Telugudesam
YSRCP
Congress

More Telugu News