కేటీఆర్ తన బానిస కుక్కలతో మొరిగిస్తే తగిన బుద్ధి చెబుతాం: ఓయూ విద్యార్థులు
Advertisement

కేటీఆర్ తన బానిస కుక్కలతో మొరిగిస్తే తగిన బుద్ధి చెబుతాం: ఓయూ విద్యార్థులు

OU students warns ktr for balka suman comments on Revanth Reddy
  • ఓయూలో కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన విద్యార్థులు
  • రేవంత్ రెడ్డిపై ఇష్టారీతిన మాట్లాడిన బాల్క సుమన్... కేటీఆర్‌కు బానిస అంటూ ఆగ్రహం
  • అధికారంలో ఉన్నప్పుడు కూడా అహంకారంతో రెచ్చిపోయారని ఆరోపణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బానిస కుక్కలతో కాంగ్రెస్ నేతలపై మొరిగిస్తే ఓయూ విద్యార్థులు తగిన గుణపాఠం చెబుతారని టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు, ఓయూ విద్యార్థి ఉద్యమ నాయకుడు కోట శ్రీనివాస్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... ఆయన వ్యాఖ్యల వెనుక కేటీఆర్ ఉన్నాడని ఆరోపిస్తూ... కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేవంత్ రెడ్డిపై ఇష్టారీతిన మాట్లాడిన బాల్క సుమన్.... కేటీఆర్‌కు బానిస అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో రెచ్చిపోయారని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అహంకారాన్ని సహించలేక ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్చను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డిపై స్వయంగా కేటీఆరే... బాల్క సుమన్ చేత అలాంటి మాటలు మాట్లాడించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై తన బానిస కుక్కలతో కేటీఆర్ మొరిగిస్తే ఓయూ విద్యార్థులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Advertisement
KTR
Telangana
Revanth Reddy
ou

More Telugu News