Kishan Reddy: అప్పులు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తోంది: కిషన్ రెడ్డి

  • హామీలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ఎక్కడి నుంచి నిధులు తెస్తుందన్న కిషన్ రెడ్డి
  • రేషన్ కార్డులు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని విమర్శ
  • పొదుపు సంఘాలకు కేంద్రం నిధులు ఇస్తోందన్న కిషన్ రెడ్డి
Revanth Govt is trying to get loans says Kishan Reddy

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలతో గారడీ చేసిందని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ హామీలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకుంటుందో స్పష్టత లేదని అన్నారు. అప్పులు తీసుకునే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉందని చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. పొదుపు సంఘాల మహిళలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించే దిశగా బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని తెలిపారు.

More Telugu News