Miyapur CI: మహిళతో అమర్యాదకర ప్రవర్తన.. మియాపూర్ సీఐపై సస్పెన్షన్ వేటు

Miyapur CI suspended
  • భర్తపై ఫిర్యాదు చేసేందుకు పీఎస్ కు వచ్చిన మహిళ
  • సదరు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన సీఐ
  • పోలీసు ఉన్నతాధికారులకు బాధితురాలి ఫిర్యాదు
తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు. ఒక మహిళతో అమర్యాదకరంగా ప్రవర్తించిన కారణాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. 

వివరాల్లోకి వెళ్తే... తన భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ మియాపూర్ పీఎస్ కు వచ్చింది. అయితే ఆమె పట్ల సీఐ ప్రేమ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు విచారణ జరుపగా ప్రేమ్ కుమార్ భాగోతాలు బయటపడ్డాయి. దీంతో, ఆయనను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
Miyapur CI
Suspension
Cyberabad

More Telugu News