Team India: ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో పైకి ఎగబాకిన భారత్!

India Moved to second place in WTC points table
షార్ట్స్‌లో చూడండి
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా విశాఖపట్టణంలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత జట్టు 106 పరుగులతో విజయం సాధించి తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రెండో స్థానానికి ఎగబాకింది.

ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు, 3 ఓటములతో 55 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తొలి టెస్టు ఓటమితో కిందికి పడిపోయిన రోహిత్‌శర్మ సేన రెండో టెస్టు విజయంతో మళ్లీ రెండో స్థానానికి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఇండియా ఖాతాలో 52.77 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సౌతాఫ్రికా (50), న్యూజిలాండ్ (50), బంగ్లాదేశ్(50) ఉండగా, పాకిస్థాన్ (36.66) ఆరోస్థానానికి పరిమితమైంది. 33.33 పాయింట్లతో వెస్టిండీస్ ఏడు, 25 పాయింట్లతో ఇంగ్లండ్ 8 స్థానంలో ఉండగా పాయింట్ల ఖాతా తెరవని శ్రీలంక అట్టడుగున ఉంది.
Go Back to Shorts
Team India
Team England
Team Australia
Crime News
WTC

More Telugu News