Jagan: విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం

Visakha Sri Sarada Peetham invites CM Jagan to annual celebrations
  • ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు
  • చండీయాగంతో ప్రారంభం కానున్న ఉత్సవాలు
  • చివరి రోజున రాజశ్యామల యాగం
  • నేడు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన స్వాత్మానందేంద్ర
విశాఖపట్నంలోని చిన ముషిడివాడలో శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుపనున్నారు. ఫిబ్రవరి 15న చండీయాగంతో శారదా పీఠం వార్షికోత్సవాలు ప్రారంభం కానున్నాయి. చివరగా ఫిబ్రవరి 19న రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. 

కాగా, శారదా పీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించారు. ఇవాళ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. 

సీఎం జగన్ కు శాలువా కప్పి సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శారదా పీఠం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా, సీఎం జగన్ వార్షికోత్సవాల చివరి రోజున విశాఖ శారదా పీఠానికి వచ్చి రాజశ్యామల యాగంలో పాల్గొంటారని తెలుస్తోంది .
Jagan
Sri Sarada Peetham
Celebrations
Visakhapatnam
YSRCP
Andhra Pradesh

More Telugu News